కరోనా నుండి అలా బయటపడదాం: మహేష్ బాబు
రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు నమోదు కావడం మొదలు ప్రజల్లో భయం పట్టుకుంది. దీంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. కరోనాపై భయం వీడాలని సూచించారు.
హైదరాబాద్: చైనాలో మొదలై ప్రపంచ దేశాలను వణికిస్తోన్న వైరస్ కరోనా. ఈ ప్రాణాంతక వైరస్‌కు కోవిడ్-19 (COVID-19) అని పేరు పెట్టారు. భారత్‌లో తొలుత కేరళలో మొదలైన కరోనా కేసు అక్కడితోనే ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో, తెలంగాణలో, రాజస్థాన్‌లో కరోనా పాజిటీవ్ కేసులు రావడంతో జనాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ వ్యాప్తిపై స్పందించారు.
Must Read: వ్యభిచారం చేయలేదు.. నన్ను వదిలేయండి: నటుడు ఆవేదన
కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని మహేష్ బాబు సూచించారు. ధైర్యంగా ఉండాలని, పరిశుభ్రతతో కరోనాను జయిద్దామంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన కరోనా జాగ్రత్తల వివరాల ఫొటోను పోస్ట్ చేశారు. తన సామాజిక బాధ్యతను మహేష్ పాటించారని ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ
తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలి. ఛాతిలో నొప్పి వచ్చినా, జలుబు, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇదివరకే మెగా కోడలు ఉపాసన జాగ్రత్తలు సూచించారు. ఇలాంటి విషయాలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఆమె ట్వీట్ చేయడం తెలిసిందే.
అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు
Also Read: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి : యాంకర్